![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -25 లో....గంగని కలవడానికి పెద్దసారు, వంశీ వస్తారు. వాళ్ళని అవమానించి పంపించండని ఇషిక తన మనిషికి చెప్తుంది. దాంతో రౌడీలు అందరు పెద్దసారుని చుట్టుముడతారు. ఎవరు మీరు అని పెద్దసారు అడుగుతాడు. అప్పుడే పైడిరాజు ఎంట్రీ ఇచ్చి మీరెందుకు వచ్చారు. ఈ రోజు మా గంగ పెళ్లి అనగానే పెద్దసారు షాక్ అవుతాడు.
అప్పుడే పెళ్లికొడుకు వచ్చి గంగని చేసుకోబోయేది నేనే అని అబ్బాయి వస్తాడు. నేను ఒకసారి గంగతో మాట్లాడుతానని పెద్దసారు అంటాడు. అయినా వినిపించుకోకుండా అటు ఇటు నెట్టేస్తారు. వంశీని కొడుతుంటే ఆపండి.. మేమ్ వెళ్ళిపోతామని పెద్దసారు రిక్వెస్ట్ చేస్తాడు. మంచిగా రిక్వెస్ట్ చెయ్యండి అని రౌడీలు అంటారు. దాంతో చేతులు జోడించి పెద్దసారు రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత పెద్దసారు వంశీ ని తీసుకొని అక్కడ నుండి బయల్దేరతాడు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు కాదు.. నీ భార్య ఎప్పుడు మారేది తెలియదు.. ముందు తన సంగతి చూడమని పెళ్లికొడుకు పైడిరాజు తో అంటాడు. పైడిరాజు తన భార్యకి నిద్రమాత్రలు ఇస్తుంటే.. నువ్వు ఇంత ప్రేమ నటిస్తున్నావ్ దీని వళ్ల నా కూతురికి ఏమైనా అయితే నీ సంగతి చెప్తానని పైడిరాజుకి తన భార్య వార్నింగ్ ఇస్తుంది.
నాకు కోటి రూపాయలు వచ్చాక నిన్ను ఎవడు పట్టించుకుంటాడే అని పైడిరాజు అనుకుంటాడు. మరొకవైపు పెద్దసారు వంశీ ఇంటికి వస్తారు. ప్లాన్ సక్సెస్ అని ఇషిక, వీరు అనుకుంటారు. పెద్దసారు ఇంట్లోకి వెళ్ళాక గంగ గురించి అడుగుతారు. గంగకి ఈ రోజు పెళ్లి అని చెప్తాడు. అప్పుడే రుద్ర వస్తాడు. అక్కడ ఏం జరిగిందని అడుగుతాడు. ఏం లేదని పెద్దసారు అంటాడు. అయిన రుద్ర నమ్మడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |